బీజేపీ ఎంపీ అరవింద్ తీరుపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీరుపై టీఆర్ఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.

అరవింద్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అభిమానులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు.

అరగంటకు ఓ బీజేపీ నేత వెళ్లి పరామర్శిస్తున్నారన్నారు.హైదరాబాద్ లో శాంతి భద్రతలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

గేమ్ ఛేంజర్ మూవీతో ఆమెకు అవార్డ్ పక్కా.. థమన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!