తోలు మందమైంది.. గిచ్చినా తెలియడం లేదు..: మంత్రి పొన్నం

తెలంగాణలో కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) కీలక వ్యాఖ్యలు చేశారు.

తనకు పార్టీలో ఎవరితోనూ విభేదాలు లేవని తెలిపారు.తనతో ఎవరైనా విభేదాలు పెట్టుకుంటే వాళ్ల ఇష్టమని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

తన పార్లమెంట్ పరిధిలో అందరితోనూ బాగానే ఉన్నా పక్కా పార్లమెంట్ నియోజకవర్గ నేతల( Parliament Constituency Leaders ) గురించి తనకు తెలియదని చెప్పారు.

తనను గిచ్చినా తనకు తెలియడం లేదన్నారు.ఈ క్రమంలోనే తన తోలు మందం అయిందన్న పొన్నం ప్రభాకర్ వాళ్లే గిచ్చిగిచ్చి ఊరుకుంటారని తెలిపారు.

కాగా ప్రస్తుతం మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.