బీఆర్ఎస్, బీజేపీపై మంత్రి పొంగులేటి విమర్శలు..!!

బీజేపీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి( Minister Ponguleti Srinivasa Reddy ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

తెలంగాణకు పదేళ్ల కాలంలో బీజేపీ చేసిందేమీ లేదని తెలిపారు.కులాలు, మతాలు, ప్రాంతాలుగా ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి పొంగులేటి ఆరోపించారు.

ప్రస్తుతం రాముడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారని విమర్శించారు.బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగం మార్చేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ( CM KCR )రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి మన నెత్తిన పెట్టారంటూ తీవ్రంగా మండిపడ్డారు.

ఈ క్రమంలోనే కేసీఆర్ మాట్లాడేవన్నీ అబద్ధాలేనని విరుచుకుపడ్డారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ .. అసలు టార్గెట్ బీఆర్ఎస్ ?