మంత్రి పెద్దిరెడ్డిది ఆటవీక పాలన..: నారా లోకేశ్

ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకున్న ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు.

పుంగనూరులో దళితనేతను చిత్రహింసలకు గురిచేయడం హేయమైన చర్యని మండిపడ్డారు.పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి ఆటవీక పాలన సాగిస్తున్నారని నారా లోకేశ్ ఆరోపించారు.

ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై ప్రభుత్వ అణచివేత చర్యలు సరికాదని పేర్కొన్నారు.ఇప్పటికైనా రాజ్యహింసను ఆపి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు.

అదేవిధంగా దళితనేతపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

పుష్పరాజ్ లాంటి వ్యక్తులు బయట కూడా ఉన్నారు.. రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్!