పుంగనూరు ఘర్షణలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి..!!
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు "ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి" అనే కార్యక్రమంలో భాగంగా నిన్న పులివెందుల పర్యటించగా నేడు పుంగనూరులో( Punganur ) పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు( Chandrababu ) పుంగనూరు పర్యటనలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్ చేయడం జరిగింది.ఇదే సమయంలో పోలీసుల వాహనం కూడా తగలబడింది.
దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి గాల్లోకి కాల్పులు జరిపారు.ఈ క్రమంలో పుంగనూరు మంత్రి పెద్దిరెడ్డి జాగీరా అని చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
పుంగునూరులో జరిగిన విద్వాంసానికి పెద్దిరెడ్డి ఇంకా పోలీసులే కారణమని విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు.
పరిస్థితి ఇలా ఉండగా పుంగునూరు ఘర్షణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) స్పందించారు.
పక్కా ప్లాన్ ప్రకారమే పుంగనూరులో ఘర్షణలు జరుగుతున్నాయని ఆరోపించారు.రౌడీలు మారణాయుధాలతో పోలీసులపై దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తే ఎవరు సహించరు అని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు.పుంగునూరు దాడుల ఘటనలో చంద్రబాబుని మొదటి ముద్దాయిగా చేర్చాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే జరిగిన ఘర్షణలలో గాయపడిన పార్టీ కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించి ధైర్యం చేప్పడం జరిగింది.
అల్లు అర్జున్ కి ఒక రూల్..వారికి ఒక రూలా… బన్నీ అరెస్టుపై సుమన్ షాకింగ్ కామెంట్స్!