YS Sharmila : వైయస్ షర్మిలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

వైయస్ షర్మిల( YS Sharmila ) కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాక ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.

ముఖ్యంగా ఆమెకు ఏపీ పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పజెప్పడం సంచలనం సృష్టించింది.

దీంతో వైఎస్ షర్మిల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా అని జిల్లాలలో.

కాంగ్రెస్ పార్టీ ( Congress Party )కార్యకర్తలతో నాయకులతో భేటీ అవుతున్నారు.ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తీవ్ర కృషి చేస్తున్నారు.

ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.వైసీపీ .

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి తొత్తుగా మారిందని విమర్శలు చేస్తున్నారు. """/" / ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల విషయంలో కీలకంగా కామెంట్లు చేస్తున్నారు.

నేడు ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం దీక్ష కూడా చేపట్టడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారని ఫైర్ అయ్యారు.ఎంపీ కేశినేని నాని( MP Keshineni Nani ) కూడా ఈ విషయాన్ని బయటపెట్టారని చెప్పుకొచ్చారు.

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పార్టీలకు డిపాజిట్లు కూడా రావని అన్నారు.రాష్ట్రంలో మరోసారి సీఎం జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం కొలువు తీరటం పక్కా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra Reddy )వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని అన్నారు.వైయస్ షర్మిలను చంద్రబాబు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారని ఆరోపించారు.

సీఎం జగన్ పై అకారణంగా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మనిషివా.. మోహన్ బాబువా.. అంటూ సీనియర్ జర్నలిస్ట్ ఆగ్రహం.. పోస్ట్ వైరల్