మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొలది నేతల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.
తాజాగా మాజీ సీఎం బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డిపై( Kiran Kumar Reddy ) మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి.మంత్రి పెద్దిరెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో డిసిసి అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కాలు పట్టుకున్నాడని అన్నారు.
దీంతో మాజీ సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
నేను కాలు పట్టుకున్నానని కిరణ్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. """/" /
కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సోనియాగాంధీ కాళ్ళకే మొక్క లేదు.
చిదంబరం( Chidambaram ) కాలు పట్టుకుని కిరణ్ సీఎం అయ్యారు అంటూ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీని కిరణ్ కుమార్ రెడ్డి సర్వనాశనం చేశారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) ముఖ్యమంత్రిగా పనిచేసి బీజేపీ నుంచి పోటీ చేయటం సిగ్గుచేటు అని అన్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నన్ని రోజులు ఆయనతో సన్నిహితంగా ఉండి.మరణించిన తర్వాత వైయస్ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేశారని వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
అటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడొచ్చి ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.జగన్ ను జైల్లో పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి కాదా అంటూ నిలదీశారు.
వైయస్ జగన్ అరెస్టు చేస్తానని రాష్ట్ర విభజనకు సహకరిస్తానని చెప్పి చిదంబరం కాలు పట్టుకున్నారని అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అంటూ.
కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి సీరియస్ కామెంట్లు చేయడం జరిగింది.
నాని, విజయ్ దేవరకొండ పాన్ ఇండియాలో తెలుగు సినిమా స్థాయిని పెంచుతారా..?