సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేసిన మంత్రి పవన్ కళ్యాణ్..!!

నేడు మంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కి ఏపీ ప్రభుత్వం 5 శాఖలు కేటాయించటం తెలిసిందే.

ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ( CM Chandrababu )ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

మిగతా మంత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.అందరం కలిసి రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తామని పేర్కొన్నారు.

మంత్రులుగా నియమితులైన వారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నట్లు పోస్ట్ పెట్టారు.ఈ క్రమంలో చంద్రబాబు పెట్టిన పోస్ట్ కి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో స్పందించారు.

"""/" / "హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు.ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి సీఎం చంద్రబాబు క్యాబినెట్ లో పనిచేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నాను.

ఎన్డీఏ మార్గదర్శనంలో.మా మంత్రివర్గ సమిష్టి కృషితో సమాజంలోని అన్ని వర్గాలకు పురోగతి, సంక్షేమంతో కూడిన సమగ్ర అభివృద్ధి అందించడానికి పాటుపడతాం.

ఈ సందర్భంగా చంద్రబాబు గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.శక్తివంతమైన సుసంపన్నమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహకారం చేయాలనా మన విజన్ కోసం మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాను" అంటూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించడం జరిగింది.

తండ్రి తప్పుకుంటే కూతుళ్లు నిలబెట్టారు.. ప్రస్తుతం సినిమాని నిలబెడుతున్నారు