వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు ప్రెస్‌మీట్‌

టీడీపీ ఇకనైనా భ్రమలు వీడాలి.వాస్తవాలు గుర్తించాలి వ్యవసాయ రంగంలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది.

ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది.అయినా టీడీపీ అవాకులు.

చెవాకులు.దుష్ప్రచారం రైతు సదస్సుల పేరిట అర్ధం లేని విమర్శలు అచ్చెన్నాయుడివి అచ్చం పగటి కలలు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కె.

కన్నబాబు వెల్లడి వ్యవసాయ రంగంలో మరింత వేగంగా పురోగతి గణనీయంగా ఆప్కాబ్, డీసీసీబీలు, ప్యాక్స్‌ వ్యాపారం పూర్తి సహకారానికి నాబార్డు ఛైర్మన్‌ హామీ వ్యవసాయ రంగంలో ప్రభుత్వానికి నాబార్డు ప్రశంసలు ఓర్చుకోలేకనే టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శలు ప్రెస్‌మీట్‌లో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కె.

కన్నబాబు.ప్రెస్‌మీట్‌లో మంత్రి శ్రీ కె.

కన్నబాబు ఏమన్నారంటే నాబార్డు ప్రశంసలు: రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధం రంగాలకు తగిన సహకారం అందిస్తామని నాబార్డు ఛైర్మన్‌ గోవిందరాజుగారు హామీ ఇచ్చారు.

గత ఏడాది కన్నా ఈసారి సహకార రుణాలు పెంచుతామని ఆయన చెప్పారు.అందుకోసం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

రాష్ట్రంలో వ్యవసాయ రంగం చక్కగా అభివృద్ధి చెందుతోందని ఆయన ప్రశంసించారు.రైతు సంక్షేమ పథకాలను కూడా ఆయన అభినందించారు.

ఉదయం సీఎంగారితో సమావేశం తర్వాత మధ్యాహ్నం డీసీసీబీ ఛైర్మన్లు, సీఈఓలతో పాటు, ఆప్కాబ్‌ అధికారులతో నాబార్డు ఛైర్మన్‌ సమావేశమయ్యారు.

ఆ సమావేశంలో కూడా ఆయన ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు.గణనీయంగా సహకార వ్యాపారం: ఆప్కాబ్‌ ఈ ఏడాది రూ.

28 వేల కోట్ల వ్యాపారం చేస్తే, వచ్చే ఏడాది అది ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ)లు రూ.50 వేల కోట్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌–ప్యాక్స్‌) రూ.

16 వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి.గత రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వం చూపిన చొరవ వల్లే ఇది సాధ్యమైంది.

ఆర్బీకేలలో మరిన్ని సేవలు: గత నెల 24న జరిగిన సమావేశంలో సీఎంగారు స్పష్టంగా చెప్పారు.

రైతులకు కావాల్సిన అన్ని సేవలు ఆర్బీకేలలో అందాలని చెప్పారు.అందుకే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్‌)ను కూడా వాటిని అనుసంధానం చేస్తున్నాం.

ఆ విధంగా సహకార రంగం స్ఫూర్తి దెబ్బతినకుండా చూస్తున్నాం.దాదాపు రూ.

16 వేల కోట్లతో గ్రామాల్లో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం.

ఆ విధంగా అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

దురుద్దేశంతోనే సదస్సు–అన్నీ అసత్యాలు: ఇవాళ నాబార్డు ఛైర్మన్‌ వస్తున్నారని, ప్రభుత్వానికి సహకారం ఇస్తామని ఆయన చెబుతారని తెలిసి, టీడీపీ కావాలని రైతుల సదస్సు నిర్వహించింది.

అందులో యథావిథిగా ప్రభుత్వంపై బరుద చల్లారు.ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నీ అసత్యాలు చెప్పారు.

రాష్ట్రంలో క్రాప్‌ హాలీడే ప్రకటించారని ఆరోపించారు.ఆ విధంగా సిగ్గు లేకుండా విమర్శించారు.

నిజానికి 2014 తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో రైతులు పంటలు పండించలేమని క్రాప్‌ హాలీడే ప్రకటిస్తే, ఆనాడు హోం మంత్రిగా ఉన్న చిన్న రాజప్ప వారిని పోలీసులతో బెదిరించారు.

దీన్ని రైతులు ఇంకా మర్చిపోలేదు.గోదావరి ఆయకట్టు కింద రెండో పంటకు నీరివ్వడం లేదని టీడీపీ ప్రచారం చేస్తోంది.

కానీ 10,500 క్యూసెక్కుల నీరు గోదావరి డెల్టాకు ఇచ్చాం.ఎక్కడా సరఫరా తగ్గలేదు.

క్రాప్‌ హాలీడే లేకున్నా, ప్రకటించారని విమర్శిస్తున్నారు.దుర్భాషలు: ఒకవైపు లోకేష్, మరోవైపు అచ్చెన్నాయుడు పని కట్టుకుని సీఎంగారిని దుయ్యబడుతున్నారు.

తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతున్నారు.ఎవరైనా మంత్రులు కాస్త విమర్శలు చేస్తే, భాషపై దుమ్మెత్తి పోస్తున్నారు.

కానీ వారు అంత కంటే దారుణంగా మాట్లాడుతున్నారు.రాష్ట్రాన్ని ఒక మూర్ఖుడు పాలిస్తున్నాడని వారంటున్నారు.

కానీ జగన్‌గారిని చూసిన ఎవ్వరైనా ఆ మాట అనగలరా? జగన్‌గారు సుదీర్ఘయాత్రలో కోట్లాది మందిని కలిశారు వారి బా«ధలు విన్నారు.

అధికారం చేపట్టాక ప్రతి ఒక్కరిని ఎంతో ఆదరిస్తున్నారు.అందరితో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు.

అంతేకానీ మీ మాదిరిగా అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, లేనప్పుడు మరొక విధంగా వ్యవహరించడం లేదు.

పిట్టలదొరలా మాటలు: మీ 14 ఏళ్ల పాలన చూసిన ప్రజలు విసుగెత్తిపోయి, ఇక చాలంటూ తమ స్పష్టమైన తీర్పు ఇచ్చారు.

అయినా వాస్తవాలు గుర్తించకుండా మీడియా బలం ఉంది కాబట్టి, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు.

అసలు మీకు ఎందుకంత అక్కసు?.ఏదో ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని జగన్‌గారు రద్దు చేస్తారని, ఎన్నికలు జరిగితే తమకు 160 సీట్లు వస్తాయని అచ్చెన్నాయుడు అచ్చం పిట్టలదొరలా మాట్లాడుతున్నాడు.

ఇప్పటికిప్పుడు నిద్రలో లేచి జగన్‌గారు ప్రభుత్వాన్ని రద్దు చేస్తారట.ఆ విధంగా టీడీపీ నేతలు భ్రమల్లో బతుకుతున్నారు.

తాము అధికారంలోకి వస్తామని చెబుతున్నారు.అలా కొంచెం కూడా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.

వ్యవసాయంలో ఏపీ నెం.1: వ్యవసాయ రంగంలో ఏపీ దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉంది.

అది కేవలం జగన్‌గారి వల్లనే సాధ్యమైంది.ఈ విషయాన్ని కేంద్రమే గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌లో స్వయంగా ప్రకటించింది.

అయితే వ్యవసాయాన్ని, రైతులను గాలికి వదిలేశారని టీడీపీ ప్రచారం చేస్తోంది.నాలుగు ఛానళ్లు, పేపర్లు ఉన్నాయి కాబట్టి, ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నారు.

వాస్తవాలు తెలుసుకొండి: ఇవాళ రాష్ట్రంలో ఒకటో తేదీ తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్‌ ఇవ్వడంతో పాటు, ప్రభుత్వ పథకాలను వలంటీర్లు ఇంటి వద్దనే అందిస్తున్నారు.

రేషన్‌ సరుకులు ఇంటి వద్దనే ఇస్తున్నారు.మీరు ఇక్కడ ప్రెస్‌మీట్లు పెట్టి ఏవేవో విమర్శలు చేస్తున్నారు.

రైతు సదస్సు పేరిట అక్కసు వెళ్లగక్కుతున్నారు.వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే, అక్కడే అలాగే మిగిలిపోతారు.

వ్యవసాయం మరింత పురోగతి: వ్యవసాయ రంగంలో రాష్ట్రం ఇంకా అగ్రస్థానంలో నిలుస్తుంది.ఆ దిశలో ప్రభుత్వం పని చేస్తోంది.

త్వరలో మిలెట్‌ ప్రమోషన్‌ పాలసీ, ఆర్గానిక్‌ ప్రమోషన్‌ పాలసీ తీసుకొస్తాం.మైక్రో ఫార్మింగ్‌ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నాం.

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వ్యక్తిగత ఫామ్‌ మెకనైజేషన్‌ ఫార్మింగ్‌లో భాగంగా రైతులకు ఆధునిక ఉపకరణాలు, వ్యక్తిగత పనిముట్లు కూడా ఇవ్వబోతున్నాం.

ఇవే కాకుండా డ్రిప్‌ ఇరిగేషన్‌.దీనికి ఇంకా డిమాండ్‌ ఉందని అందరూ చెబుతున్నారు.

కాబట్టి త్వరలో టెండర్లు పిలవబోతున్నాం.రైతులకు ఆ పరికరాలు, ఉపకరణాలు అందించబోతున్నాం.

ఇంకా మార్కెట్‌ యార్డులలో చాలా మార్పులు చేయబోతున్నాం.వచ్చే ఏప్రిల్‌ నుంచి అన్ని మార్కెట్‌యార్డులను ఆధునీకరించబోతున్నాం.

మీ ఊహకు కూడా అందనంత గొప్పగా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయబోతున్నాం.

ఏనాడూ మీకు చిత్తశుద్ధి లేదు: ఇవాళ నాబార్డు ఛైర్మన్‌ వస్తున్నారు కాబట్టి, మీరు కావాలనే రైతు సదస్సు నిర్వహించి, అవాకులు చెవాకులు పేలితే మీకు కావాల్సిన పత్రికల్లో పెద్దగా రాయించుకోవచ్చని భావించారు.

నిజానికి మీరు ఏనాడూ రైతుల గురించి, వ్యవసాయం గురించి ఆలోచించలేదు మీ హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది.

పగటి కలలు మానండి: అచ్చెన్నాయుడుగారికి ఒకటే చెబుతున్నాను.పగటి కలలు కనడం మానండి.

అధికారంలోకి వస్తామన్న భ్రమల్లో బతకకండి.గత ఎన్నికల్లో ఉద్యోగుల వల్ల ఓడిపోయామని వారంటున్నారు.

ఇటీవల వారిని రెచ్చగొట్టాలని చూశారు.కానీ ఏం పొందలేకపోయారు.

ప్రశ్నలకు సమాధానమిస్తూ.కేంద్రమే చెప్పింది: మూడు రాజధానుల బిల్లు ప్రభుత్వం ఉపసంహరించుకున్న తర్వాత అమరావతి రాజధానిగా ఉంది.

అందుకే కేంద్రం అమరావతి పేరుతో నిధులు కేటాయించింది.నిజానికి రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే అని కేంద్రం కూడా స్పష్టంగా చెప్పింది.

మీది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం : అమరావతి భూములపై ఎవరి ప్రయోజనాలు ఉన్నాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు.

రాత్రికి రాత్రి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చి, గ్రాఫిక్స్‌తో అందరినీ భ్రమల్లో పెట్టి, 5 ఏళ్లలో ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణం లేకుండా కాలం గడిపారు.

మాకు అమరావతి భూములపై ఆసక్తి ఎందుకుంటుంది.రాజధాని పేరుతో ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసింది చంద్రబాబు.

ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారు.కరోనా కష్టకాలంలో అవి తప్పలేదు: కోవిడ్‌ కష్ట కాలంలో నిరుపేదలను ఆదుకోవడానికి కేంద్రంతో సహా, అందరూ అప్పులు చేయాల్సి వచ్చింది.

మీ పాలనలో కూడా పెద్ద ఎత్తున అప్పులు చేశారు.కానీ వాటితో ఏం పని చేశారు? ఎక్కడైనా ప్రజలకు డీబీటీ కింద ఏమైనా ఇచ్చారా?.

ఇవాళ అప్పులపై మీ ఇష్టం వచ్చిన ఫిగర్‌ చెబుతున్నారు.మీకు మీడియా ఉంది కాబట్టి, అర్ధం లేకుండా మాట్లాడుతున్నారు.

నిష్పాక్షిక దర్యాప్తు కోరుకున్నారు: రాష్ట్రంలో సీబీఐ రాకుండా చూస్తామని, అడుగు పెట్టనివ్వబోమని అన్నది ఎవరు? కానీ ఈ ప్రభుత్వం ఆ మాట అనలేదు కదా?.

అందుకే అడగక ముందు వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కోరాం.ఆ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలని సీఎం గారు ఆకాంక్షించారు.

అందుకే ఎక్కడా సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోలేదు.అది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం.

అని మంత్రి శ్రీ కన్నబాబు వివరించారు.

నేడు ఏపీ ఈ -క్యాబినెట్ సమావేశం.. చర్చించే అంశాలు ఇవే