వైఎస్ షర్మిలకు మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్
TeluguStop.com
వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు.
రాజన్న బిడ్డవైతే మునుగోడులో పోటీ చేసి సత్తా చూపించాలన్నారు.నీ తండ్రి వైఎస్ఆర్ ఆదాయపు పన్ను కట్టకముందే న్యాయవాదిగా పన్ను కట్టిన వ్యక్తినని చెప్పారు.
అదేవిధంగా నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు తెచ్చి ప్రతి ఎకరాకు నీరు పారించిన చరిత్ర తనదని అన్నారు.
అయితే, కొన్ని రోజులుగా మంత్రి నిరంజన్ రెడ్డి, షర్మిల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో షర్మిలపై నిరంజన్ రెడ్డి అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర మీదంటూ మండిపడ్డారు.
బాలీవుడ్ ను దెబ్బ మీద దెబ్బ కొడుతున్న టాలీవుడ్…