పవన్ కళ్యాణ్ “వారాహి” యాత్రపై మంత్రి మేరుగు నాగార్జున సీరియస్ కామెంట్స్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రేపటినుండి "వారాహి" యాత్ర ( Varahi Yatra ) ప్రారంభించబోతున్నారు.

ఉభయగోదావరి జిల్లాలలో ఈ యాత్ర సాగనుంది.ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజులపాటు పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు.

అయితే ఈ "వారాహి" యాత్రపై వైసీపీ మంత్రి మెరుగు నాగార్జున( Minister Merugu Nagarjuna ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్లిన దూకుడు గాళ్లు సీఎం రమేష్, సుజనా చౌదరి ఇచ్చిన స్క్రిప్ట్ ను బీజేపీ నాయకులు చదువుతున్నారని కావాలని వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు.

మరి విభజన హామీల విషయంలో ఎందుకు స్పందించడం లేదు అని బీజేపీ నేతలను మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించడం జరిగింది.

"""/" / ఏపీ ప్రజలు మొదటి నుంచి అడుగుతున్న ప్రత్యేక హోదా( Special Status ) గురించి కూడా మాట్లాడలేదని అసహనం వ్యక్తం చేశారు.

ఎన్ని పార్టీలు కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం గ్యారెంటీ.

మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ నీ అడ్డుకోవడం ఎవరి తరం కాదు అని మేరుగు నాగార్జున ధీమా వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ వారాహి యాత్రను ఉద్దేశించి సెటైర్లు వేశారు.

పవన్ యాత్రను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు.అది వారాహి యాత్ర కాదు నారాహి యాత్ర అంటూ ఎద్దేవా చేశారు.

అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ కితాబు ఇవ్వటం జరిగింది.

విద్యా వ్యవస్థలో విఫలవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పిల్లల బంగారు భవిష్యత్తుకు ముఖ్యమంత్రి జగన్ వేస్తున్నారు అని కొనియాడారు.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?