రేణుక చౌదరి అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి మేరుగా నాగర్జున..

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం: ఎస్సీ, బిసి, లను ఉద్దేశపూర్వకంగా రేణుక చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై "సాంఘిక, సంక్షేమ, మంత్రి మేరుగా నాగర్జున" మండిపడ్డారు.

ఎస్సీ, ఎస్టీలు, ఓట్లు వేస్తేనే నువ్వు కార్పొరేటర్ అయ్యావని గుర్తు పెట్టుకో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని మంత్రి అన్నారు.

ఈ రాష్ట్రంలో జగనన్న సుపరిపాలన చూసి ఓర్వలేక, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లే విధానంలో మా జగనన్న ప్రభుత్వం ప్రజల మన్ననలను పొందటం ఓర్వలేక ఇలాంటి రేణుక చౌదరి లాంటి వాళ్ళని అడ్డుపెట్టుకొని తక్కువ కులాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం తగదని మంత్రి మెరుగ నాగార్జున అన్నారు.

జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు కన్నా ఎవరి హామీలు కూడా నెరవేర్చటంలో ముందంజలో ఉన్నారని అది ఓర్వలేకే ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడతున్నారని అన్నారు.

నీకు దమ్ముంటే 2024 లో జరగబోయే ఎన్నికలకు టిడిపి తరఫున ప్రచారం చేసి నిలబడమని మంత్రి నాగార్జున సవాలు విసిరారు.

మణిపూర్ : భారత సంతతి ప్రొఫెసర్‌పై కేసు నమోదు.. ఖండించిన కుకీ విద్యార్ధి సంఘం