నారా లోకేశ్‎పై మంత్రి మేరుగ నాగార్జున ఫైర్

టీడీపీ నేత నారా లోకేశ్‎పై మంత్రి మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.దళితులపై అక్రమంగా దాడులకు పాల్పడితే కేసులు పెట్టారా అని ప్రశ్నించారు.

తప్పు చేస్తే నీ మీదే కాదు నీ బాబు మీద కూడా కేసులు పెడతామంటూ మంత్రి హెచ్చరించారు.

గత ప్రభుత్వ హయాంలో దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన డబ్బులు ఇతరాలకు ఖర్చు చేసారని ఆరోపించారు.

రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న మంచిని చూడలేక కుట్రపూరితంగా వ్యవహారిస్తున్నారని, అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

రోత పుట్టించిన మందుల చీటి రాతతో నకిలీ డాక్టర్ పట్టివేత!