బండి సంజయ్‎కు మంత్రి మల్లారెడ్డి సవాల్..!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు.

తెలంగాణలో అమలు అయ్యే సంక్షేమ పథకాలు వేరే ఏ రాష్ట్రంలో ఉన్నాయో చెప్పాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఎక్కడా అమలు అవుతున్నాయో చూపించాలన్నారు.బండి సంజయ్ ఏ రాష్ట్రానికి రమ్మంటే ఆ రాష్ట్రానికి వస్తానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

బండి సంజయ్ ఈ విషయాన్ని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు.

వైరల్ వీడియో.. కారం కారంగా, చల్ల చల్లగా పచ్చిమిర్చి ఐస్ క్రీమ్‌ని టేస్టు చేసారా?