నూతన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం

తెలంగాణ అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో నూతన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై దిశానిర్దేశం చేశారు.

ఈనెల 19న కొత్త సెక్రటేరియట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారన్న సంగతి తెలిసిందే.

ప్రారంభోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో సభ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.

ఈ మేరకు సభను విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

గ్రేటర్ లోని ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మందిని తరలించాలని సూచించారు.

జన సమీకరణ కోసం ఈనెల 13న కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

కథని మహేష్ బాబు క్రేజ్ డామినేట్ చేసింది.. విజయేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు!