ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ విమ‌ర్శనాస్త్రాలు

కేంద్ర ప్ర‌భుత్వం, ప్ర‌ధాని మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఎనిమిదేళ్ల పాల‌న‌లో ప్ర‌జ‌ల సంక్షేమాన్ని కేంద్ర ప్ర‌భుత్వం గాలికి వ‌దిలేసింద‌ని ఆరోపించారు.బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌లను మోసం చేయ‌డ‌మే మీ ల‌క్ష్య‌మా అని ప్ర‌శ్నించారు.

పేద‌ల‌కు ఇస్తే ఉచితాలు.పెద్ద‌ల‌కు ఇస్తే ప్రోత్సాహ‌కాలా అని మండిపడ్డారు.

మోదీకి దేశ సంప‌ద‌ను పెంచే తెలివి లేదు, పేద‌ల సంక్షేమానికి ఖ‌ర్చు చేసే మ‌న‌సు లేద‌ని ఎద్దేవా చేశారు.