మునుగోడు ఆర్వో బదిలీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

మునుగోడు ఆర్వో బదిలీపై మంత్రి కేటీఆర్ స్పందించారు.ఆర్వో బదిలీ వ్యవహరంలో కేంద్రం ఎన్నికల సంఘం తీరు ఆక్షేపనీయమని అన్నారు.

రాజ్యాంగ వ్యవస్థలను9 బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.ఎలక్షన్ కమిషన్ పై బీజేపీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.

2011 లోనే సస్పెండ్ చేసిన రోడ్ రోలర్ గుర్తును తిరిగి పెట్టడమనేది ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యనించారు.

మునుగోడులో ఓటమి తప్పదని అర్థమైన బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీజేపీ దొడ్డిదారిన ఓట్లు పొందేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోందన్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలని ఆయన కోరారు.

13 ఏళ్లకే సన్యాసినిగా మారిన బాలిక.. కుంభమేళాలో ఈ ఘటనపై మీరేమంటారు..