ఢిల్లీ డిప్యూటీ సీఎం అరెస్ట్‎పై మంత్రి కేటీఆర్ కామెంట్స్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అరెస్ట్ ను ఖండించిన కేటీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు.ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహారిస్తోందని ఆరోపించారు.

కావాలనే విపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని విమర్శించారు.అధికారంలోకి రాలేని రాష్ట్రాల్లో అక్కడ ఉన్న పార్టీలను బలహీనపరిచేందుకు ఈలాంటి చర్యలకు పాల్పడుతుందన్నారు.

ఇందులో భాగంగానే సిసోడియాను అరెస్ట్ చేయడమని కేటీఆర్ మండిపడ్డారు.కుట్రపూరితంగా వ్యవహారిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చెప్పారు.

రాబోయే రోజుల్లో బీజేపీ నేతలు సైతం ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని వెల్లడించారు.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!