పెద్ద బడిలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

పెద్ద బడిలో మంత్రి కేటీఆర్( Minister KTR ) జన్మదిన వేడుకలు గివ్ తెలంగాణ ఫౌండేషన్( Give Telangana Foundation ) ఆధ్వర్యంలో 720 మంది విద్యార్థులకు ప్లేట్లు వితరణరాజన్న సిరిసిల్ల జిల్లా :పెద్ద బడిలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను సోమవారం గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పెద్దబడి స్కూల్ క్యాంపస్ లో జన్మదినాన్ని పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల, జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల లోని 720 మంది విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, ఎంపిపి పిల్లి రేణుక కిషన్, ఎంపీటీసీలు నాగరాణి, అనసూయ, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు అప్సర ఉన్నిసా, గివ్ తెలంగాణ కోఆర్డినేటర్ వర్ధవెల్లి సాయికృష్ణ, వార్డు సభ్యులు దేవేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బీజింగ్‌లో గాంధీ జయంతి వేడుకలు.. భారీగా హాజరైన ప్రవాస భారతీయులు