నిరుద్యోగులతో చిట్ చాట్ చేసిన మంత్రి కేటీఆర్..!!
TeluguStop.com
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకుడు మంత్రి కేటీఆర్ చురుకుగా పాల్గొంటున్నారు.ఒకపక్క బహిరంగ సభలో పాల్గొంటూనే మరోపక్క సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రజలకు చేరువవుతున్నారు.
ఇదే సమయంలో పలు యూట్యూబ్ ఫేమస్ చానల్స్ కి కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
తెలుగు రాజకీయాల ఎన్నికల ప్రచారంలో కొత్త పంతాలో కేటీఆర్ ట్రెండ్ సృష్టిస్తున్నారు.ఈ క్రమంలో ఎన్నికలవేళ అన్ని వర్గాల ఓటర్లతో మమేకమవుతున్నారు.
తాజాగా హైదరాబాద్ లోని అశోక్ నగర్ కి చెందిన కొంతమంది నిరుద్యోగ యువతతో చిట్ చాట్ చేయడం జరిగింది.
"""/" /
ఈ సందర్భంగా భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక కల్పించే ఉద్యోగాలపై.
మంత్రి కేటీఆర్ వారికి హామీలు ఇచ్చినట్లు సమాచారం.రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగాలు కల్పన వంటి విషయాలపై స్పష్టత కూడా ఇవ్వటం జరిగింది.
కచ్చితంగా ఎన్నికల తర్వాత తెలంగాణలో నిరుద్యోగులకు మంచి భవిష్యత్తు కల్పించే విధంగా ముందడుగు వేయబోతున్నట్లు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా నిరుద్యోగ యువతతో నిర్వహించిన సమావేశానికి సంబంధించిన ఫోటోలు.మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి నవంబర్ 28 ఆఖరి తేదీ కావటంతో.కేటీఆర్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఈ క్రమంలో సోమవారం నిరుద్యోగులతో భేటీ కావడం సంచలనంగా మారింది.
‘మన హక్కు హైదరాబాద్’ అంటూ కర్టెన్ రైజర్ ప్రచార గీతం..