ముంచుకొస్తున్న ముప్పు ! కేటీఆర్ వార్నింగ్ పనిచేసేనా ?
TeluguStop.com
తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై సీఎం కేసీఆర్ కంటే ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ కాస్త ఎక్కువ టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తున్నారు.
గతంలో మాదిరిగా తెలంగాణలో టిఆర్ఎస్ కు ఏకపక్షంగా ఆదరణ లేకపోవడం, రాజకీయ శత్రువులు బలమైన వారు కావడం, కొత్తగా షర్మిల పార్టీ తెరపైకి రావడం ఇలా ఎన్నో కారణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
దీనికితోడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
వివిధ సర్వే రిపోర్టులు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.అందుకే గత కొంత కాలం నుంచి అన్ని వర్గాల ప్రజలను, ఉద్యోగులను , ఉద్యమ నాయకులను ఆకట్టుకునేందుకు కెసిఆర్, కేటీఆర్ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన పార్టీలోని నాయకులు అందరినీ సమన్వయం చేసుకుంటూ, ఎక్కడా ఎటువంటి అసంతృప్తులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉండడంతో మరింత అలర్ట్ గా ఆయన వ్యవహరిస్తున్నారు.
ఇటీవలే గ్రేటర్ ఎన్నికలలో ఫలితాలు ఆందోళనగానే వచ్చినా టిఆర్ఎస్ మేయర్ స్థానాన్ని దక్కించుకోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు టిఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకం కావడంతో, వీటిపైన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టిపెట్టారు.
ఇటీవలే ఎమ్మెల్యేలు ఎంపీలు, మాజీ కార్పొరేటర్ లు, కీలకమైన నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ, పార్టీలో నెలకొన్న అసంతృప్తులను బుజ్జగిస్తూ, వార్నింగ్ లు ఇస్తూ, ఒక గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
అందరూ కలిసి మెలిసి సమన్వయంతో ముందుకు వెళుతూ, పార్టీకి మేలు చేసే విధంగా వ్యవహరించాలని, అలా కాకుండా తమకు విభేదాలే ముఖ్యమనుకుంటే అటువంటి వారు బయటికి వెళ్ళిపోవచ్చు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
"""/"/
పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయం పై తమకు పూర్తిగా అవగాహన ఉందని, ఎప్పటికప్పుడు సర్వేల రూపంలో అందరి పనితీరును అంచనా వేస్తున్నామని, వారికి భవిష్యత్తులో రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తామని కేటీఆర్ చెబుతూ పార్టీని , ప్రభుత్వం ను ఒక గాడిలో పెట్టేందుకు తాపత్రయపడుతున్నాట్టుగా కనిపిస్తున్నారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్ వార్నింగ్ ఎంతవరకు పని చేస్తాయి అనేది చూడాలి.
వాళ్లు లేకపోతే అసలు పుష్ప సినిమానే లేదు… అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?