పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం -కేటీఆర్

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందనవెళ్లి -హైతాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో వెల్‎స్పన్ అడ్వాన్స్డ్ మెటిరీయల్స్ (ఇండియా) లిమిటెడ్ పరిశ్రమ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్మన్ అనిత రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలుల కాలే యాదయ్య, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

స్ధానిక రైతులు సహకరిస్తే షాబాద్ మండలంలోనే రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

హైతాబాద్ స్థానిక యువత కోసం నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మరిన్ని పరిశ్రమలు నెలకొల్పి స్థానిక యువతకే ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఈ పారిశ్రామిక పార్కు కోసం రెండేళ్ల నుంచి కృషి చేశామని అన్నారు.ఈ ఏడాది రూ.

2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలనే లక్ష్యంతో ఉందని స్పష్టం చేశారు.హైతాబాద్ ఏరియాలో 1128 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించగా, దీనిలో టీఎస్ఐఐసీ 700 ఎకరాలను కొనుగోలు చేసి పలు సంస్థలకు కేటాయించింది.

పలు విభాగాల్లో ఉత్పత్తులు చేయనున్న వెల్‎స్పన్ పరిశ్రమతో దాదాపు 1800 మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

ఈ ప్రాంతంలో ఎనిమిది వేల కోట్లతో ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో సుమారు 10 వేల మందికి ఉపాధి లభించనుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్19, శుక్రవారం2024