వేములవాడ కు సరికొత్త అధ్యాత్మిక శోభ.. ఫోటోల ను పోస్ట్ చేసిన మంత్రి కే టి ఆర్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Vemulawada ) కు సరికొత్త అధ్యాత్మిక శోభ చేకూరింది.
నంది కమాన్ కూడళి, కొండగట్టు జంక్షన్ ను జిల్లా కలెక్టర్ మార్గదర్శనం మేరకు మున్సిపల్ అధికారులు సుందరంగా ముస్తాబు చేశారు.
ఇటీవలే అభివృద్ధి చేసిన నంది కమాన్ కూడలి ఫోటోల ను మంత్రి కే తారకరామారావు( Minister KTR ) తన ట్విట్టర్ ఖాతాలో మంగళవారం పోస్ట్ చేశారు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సరికొత్త అధ్యాత్మిక శోభ నంది జంక్షన్ మీకు స్వాగతం పలుకుతోంది.
అంటూ మంత్రి కే తారకరామారావు తన ట్విట్టర్ , ఫేస్ బుక్ లో సదరు ఫోటోలను పోస్ట్ చేశారు.
గుడ్ జాబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి( Collector Anurag Jayanthi ) అంటూ మంత్రి కే తారకరామారావు అభినందించారు.