రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అకాల వర్షాల పరిస్థితుల పైన సమీక్షించిన మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.

తారక రామారావు సిరిసిల్ల జిల్లా అధికారులతో సమీక్షించారు.జిల్లా కలెక్టర్ తో పాటు, జిల్లా ఎస్పీ, జిల్లా వ్యవసాయ అధికారిలతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి కేటీఆర్ జిల్లాలోని పరిస్థితులపైన వివరాలు తీసుకున్నారు.

అనుకోకుండా కురిసిన ఈ అకాల వర్షాల వలన నష్టపోయిన జిల్లా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

రైతులు అందోళన చెందవద్దని కోరారు.జిల్లా అధికారులతో మాట్లాడి సమాచారం తీసుకున్న అనంతరం, జిల్లా అధికార యంత్రాంగంమంతా క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలన్నారు.

జిల్లా అధికారులతో పార్టీ ప్రజాప్రతినిధులంతా రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.జడ్పిటిసి, ఎంపీటీసీలు, సర్పంచులు ప్రతి ఒక్కరు తమ తమ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించి రైతులకు అండగా ఉండాలన్నారు.

క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి రైతులకు భరోసా ఇవ్వాలని ఈ సందర్భంగా కేటీఆర్ వారికి సూచించారు.

ఇట్స్ అఫీషియల్.. ఆరోజు నుంచి బిగ్ బాస్ షో.. ఈ షో టైమింగ్స్ ఏంటంటే?