ఫ్రాన్స్ పర్యటన తొలిరోజున మంత్రి కేటీఆర్ ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్ తో సమావేశం

ఫ్రాన్స్ పర్యటన తొలిరోజున మంత్రి కేటీఆర్ ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్ తో సమావేశం అయ్యారు.

ఇన్నోవేషన్, డిజిటైజేశన్, ఓపెన్ డేటా వంటి ఫ్రాన్స్, తెలంగాణ మధ్య పరస్పర సహకారం అందించుకునే అవకాశం గురించి ఈ సమావేశంలో చర్చించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి, ఓపెన్ డేటా పాలసీ గురించి, రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మంత్రి కేటీఆర్ అంబాసిడర్ హెన్రీ వర్దియర్ కు వివరించారు.

అటు తెలంగాణలోని ఆంకుర సంస్థలకు ఫ్రాన్స్ లో, ఇటు ఫ్రాన్స్ లోని అంకుర సంస్థలకు తెలంగాణలో వ్యాపార, వాణిజ్య అవకాశాలు కల్పించడం గురించి కూడా వివరమైన చర్చ జరిగింది.

సమావేశంలో ఫ్రాన్స్ లో భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కే.ఎం.

ప్రఫుల్ల చంద్ర శర్మ, తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజాన్, డైరెక్టర్ డిజిటల్ మీడియా కొణతం దిలీప్, డైరెక్టర్ ఏవియేషన్ ప్రవీణ్ పాల్గొన్నారు.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?