మంత్రి కేటీఆర్ కు మరో కీలక అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు( Minister KTR ) అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ ఉన్న కొద్ది పెరుగుతూ ఉంది.

దీంతో వరుస పెట్టి అంతర్జాతీయ సదస్సులకు ఆహ్వానాలు అందుతున్నాయి.కొద్ది రోజుల క్రితం దుబాయ్ లో( Dubai ) జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఆహ్వానించడం జరిగింది.

ఈ కార్యక్రమం దుబాయిలోని జుమేరా ఎమిరేట్స్ టవర్ వేదికగా జూన్ 7, 8 తేదీల్లో నిర్వహిస్తున్నారు.

ఆ తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం( World Economic Forum ) సదస్సుకు హాజరు అవ్వాలని ఆహ్వానం వచ్చింది.

"""/" / ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు ఈ ఏడాది జూన్ 27 నుంచి 29వ తారీకు వరకు జరగనుంది.

ఈ సదస్సు చైనాలో జరగనుంది.ఇదిలా ఉంటే కొత్తగా ఇప్పుడు మరో అంతర్జాతీయ సదస్సుకు సంబంధించి మంత్రి కేటీఆర్ కి ఆహ్వానం అందింది.

జర్మనీలో జరిగే ఏషియా బెర్లిన్ సమ్మిట్ 2023కు రావాలని నిర్వాహకులు కోరారు.జూన్ 12 నుంచి 15 వరకు జర్మనీలో జరగనుంది.

కనెక్టింగ్ స్టార్ట్ అప్ ఈకో సిస్టమ్ అనే అంశం పైన ఈ సమావేశం జరుగుతుందని ఈ సదస్సుకు హాజరై ప్రసంగించాలని మంత్రి కేటీఆర్ ని ఆహ్వానించారు.

మంత్రి కేటీఆర్ కు జర్మనీ సెనేట్ కు చెందిన ఎకనామిక్స్, ఎనర్జీ మరియు పబ్లిక్ ఎంటర్పైజ్ శాఖ ఆహ్వానం పంపించడం జరిగింది.

డ్రాగ‌న్ ఫ్రూట్ ఆరోగ్య‌మే.. కానీ ఎవ‌రెవ‌రు తిన‌కూడ‌దో తెలుసా..?