ఎల్లారెడ్డిపేట లో 8.5 కోట్లతో అభివృద్ది చేసిన విద్యా క్యాంపస్ ప్రారంభించిన మంత్రి కేటిఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 8.5 కోట్లతో అభివృద్ధి చేసిన విద్యా క్యాంపస్ ను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

కేటీఆర్ కు గ్రామ ప్రజలు, యువకులు, పాఠశాల పూర్వ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ లో ప్రాధాన్యత పరంగా ఒక్కో సమస్యలు పరిష్కరించుకుంటున్నామని ,చిన్నారుల బంగారు భవిష్యత్తు పై మరింత దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోంది అని అన్నారు.

చిన్నారుల ఎట్లా తీర్చిదిద్దాలి.వాళ్ళ కాళ్ల పై ఎట్లా నిలబడేలా చేయాలో.

ఇరుగు పొరుగుతో ఎట్లా మసులు కోవాలో, సంతోషంగా ఎట్లా జీవించాలలో కరి కులమ్ లో ప్రభుత్వం పొందుపరనుందని అన్నారు .

విద్యార్థులు మెరుగైన మానవ సంబంధాలు ఎలా నెలకొల్పేలా బోధన లో భాగంగా శిక్షణ ఇచ్చేలా చూస్తామని ఆయన అన్నారు.

అనంతరం మంత్రి కే తారక రామారావు మాట్లాడుతూ 6 రోజుల క్రింద ఎల్లారెడ్డిపేటలో వేణుగోపాల స్వామి ఆలయం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశాం.

సంవత్సరన్నర లో పూర్తి చేస్తామన్నారు.విద్యతోనే వికాసం, అభివృద్ధి సాధ్యమని అన్నారు.

తరగతులు భారత దేశ భవిష్యత్తు కు విజ్ఞాన ఖనీ లు అని సిరిసిల్ల నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల ప్రజలు ప్రసిద్ధి సంస్థలలో పని చేస్తున్నారన్నారు.

అమెరికా లో ఎక్కడ పోయిన తెలుగు, తెలంగాణ ప్రజలు కోకొల్లలు గా వస్తారు.

వారిని చూస్తే సంతోషముగా అనిపిస్తదని ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ ఫలితాలు అని తెలిపారు.

అమెరికా లో కూడా పేదలు ఉన్నారు.ఉన్నంతలో ఎంత చేశామో ఆలోచించండి.

9 ఎండ్ల కింద విద్యా, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాలు ఎంట్లుండే.ఇప్పుడు ఎట్లుంది బేరీజు వేసుకోవాలి అని సూచించారు.

తండాలను గ్రామపంచాయతీలుగా చేశామన్నారు.ఎవరి వల్ల రాష్ట్రం బాగు అవుతుందో ఆలోచించాలని సరైన దిశలో వేలుతున్నమా లేదో ఆలోచించాలని తెలిపారు.

శాస్త్రీయ విధానంలో సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం.57 ఎండ్లలో గుడి , బడిని పట్టించుకోలే.

సాగునీటి గోస తీర్చలే 9 ఎండ్లలో అనేక సమస్యలకు పరిష్కారం చూపామన్నారు.ఎల్లారెడ్డిపేట కు బారాబర్ డిగ్రీ కళాశాల ను సిఎం కేసిఆర్ సరైన సమయంలో మంజూరు చేస్తారని తెలిపారు.

పలకతో వచ్చి పట్టా తో వెళ్ళాలనే గంభీరావుపేట లో కేజీ టు పీజీ క్యాంపస్ ఏర్పాటు చేశామని అన్నారు.

3 దశల్లో 510 ప్రభుత్వ పాఠశాలల్లో 12 మౌలిక సదుపాయాల, వసతులు సమకూరుతాయన్నారు .

ఏ ఊరికి వెళ్ళినా కోట్లాది రూపాయలతో చేపట్టిన 60 పాఠశాలల్లో 22 వేల మంది విద్యార్థులకు కంప్యూటర్ చాంప్స్ పేరుతో బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం అందిస్తున్నామని రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలకు టీ ఫైబరే తో అనుసంధానం చేయనున్నాం.

సిరిసిల్ల ఇప్పటికే అనేక అంశాల్లో దేశంలోనే ముందుందన్నారు.దేశంలో విద్య విషయంలో బెస్ట్ స్కూల్ ఎక్కడా ఉన్నాయంటే సిరిసిల్ల అనే పేరు రావాలని పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మానవ సంబంధాలు, జీవ కారుణ్యo పై పాటలలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఆడపిల్లల కు సెల్ఫ్ డిఫెన్స్ పై శిక్షణ ఇస్తామని జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లో మండలాలు, ప్రజా ప్రతినిధులు పోటీ పడాలని సూచించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాను విద్యా ప్రమాణాలలో దేశంలోనే ఆదర్శంగా నిలవాలని సూచనలు చేశారు.

బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు వేసిన వేణుస్వామి.. షో గురించి అలా చెబుతూ?