సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై మంత్రి కేటీఆర్ ఫైర్
TeluguStop.com
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగిస్తామని తెలిపారు.
వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఈనెల 8వ తేదీన మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెంతో పాటు రామగుండం కేంద్రాల్లో మహా ధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
సింగరేణిని ప్రైవేటీకరించబోమని 2022 నవంబర్ 12న రామగుండంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు.
యూటర్న్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెబుతామని తెలిపారు.
చిరంజీవి ఫ్లాప్ మూవీని ఆ హీరో మనవడు ఏకంగా 1000 సార్లు చూశాడట.. ఏమైందంటే?