కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్
TeluguStop.com
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఏ ప్రధానమంత్రి చేయని దుర్మార్గాలు మోదీ చేశారని ఆరోపించారు.
ఇప్పటికే చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతుంటే.చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీ విధించారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వానికి సరైన ఆలోచనా విధానం లేదని విమర్శించారు.ఈ నేపథ్యంలో వెంటనే చేనేతపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖను రాస్తున్నట్లు వెల్లడించారు.
దీనిపై కేంద్ర సర్కార్ దిగొచ్చేంతవరకు వేలాదిగా లేఖలు రాద్దామన్నారు.అదేవిధంగా మెగా టెక్స్ టైల్ పార్క్ కు డబ్బులు ఇవ్వాలని కోరితే స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారాయణపేట్ లో చేనేత ఇనిస్టిట్యూట్ పెడతామని చెప్పి చేయలేదని విమర్శించారు.మనం ఎందుకు వెనుకబడి ఉన్నామో ప్రజలు ఆలోచించాలని చెప్పారు.
ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆదుకోవాలని సూచించారు.
యూఎస్ సెకండ్ లేడీ ఉషా చిలుకూరిపై ట్రంప్ ప్రశంసల వర్షం