బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్

బీజేపీపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పర్యటించిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ హుజురాబాద్ కు ఈటలను పరిచయం చేసేందే కేసీఆర్ అన్న కేటీఆర్.

కానీ ఆయన ఇప్పుడు కేసీఆర్ పైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.కేంద్రం నుంచి హుజురాబాద్ కు ఒక్కపైసా కూడా రాలేదన్నారు.

ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు.పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి.

ప్రజల నుంచి రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు.

దేశంలో 14 మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పు రూ.56 లక్షల కోట్లు అయితే ప్రధాని మోదీ ఒక్కరే రూ.

100 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు.మోదీ పాలనలో ఆకాశంలో అప్పులు, పాతాళంలో రూపాయి ఉందని ఎద్దేవా చేశారు.