వైఎస్ షర్మిలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్

వైఎస్ షర్మిలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.తెలంగాణ వద్దని కొట్లాడింది దివంగత నేత వైఎస్ఆర్ అని తెలిపారు.

వైఎస్ఆర్ ఉండివుంటే తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యేది కాదన్నారు.బీజేపీ ప్రోత్సాహంతోనే వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారని ఆరోపించారు.

షర్మిల బీజేపీ వేసిన బాణం అని ప్రజలకు తెలుసని చెప్పారు.సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను తిట్టడం ఆపకపోతే పరిస్థితి బాగుండదని తెలిపారు.

రాష్ట్రంలో షర్మిల అభివృద్ధి జరగలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.తెలంగాణ అభివృద్ధిని దేశమంతా చూస్తోందని వెల్లడించారు.

ముగ్గు చల్లుతూ ఇంత అందమైన రంగోలి వేయగలరా.. ఈ వీడియో చూస్తే నమ్మలేరు!