అడ్వకేట్ కమిషన్ విచారణకు మంత్రి కొప్పుల ఈశ్వర్..!

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ అడ్వకేట్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు అయ్యారు.

గత ఎన్నికల్లో జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి సుమారు 441 ఓట్ల తేడాతో కొప్పుల ఈశ్వర్ గెలుపొందిన విషయం తెలిసిందే.

అయితే ఈ క్రమంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రీకౌంటింగ్ జరపాలని కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం అడ్వకేట్ కమిషన్ విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇందులో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ విచారణకు మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు.

1000 కోట్ల మార్కును అందుకున్న ఏడుగురు డైరెక్టర్లు వీళ్లే.. వీళ్ల టాలెంట్ వేరే లెవెల్!