మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

యాదాద్రి భువనగిరి జిల్లా:తాము తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తామని, కానీ,మా ఫోకస్ అంతా తెలంగాణను అభివృద్ధి చేయడంపైనే ఉందని ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.

జెండగే తో కలిసి ఆదివారం మంత్రి పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీరియస్ అయ్యారు.

మేము తలుచుకుంటే 39 మంది ఎమ్మెల్యేలను 39 ముక్కలు చేస్తామని, బీఆర్ఎస్ పార్టీని పద్నాలుగు ముక్కలు చేస్తామని హెచ్చరించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో హోం మినిస్టర్ కు ప్రగతి భవనంలోకి అనుమతి లేదని,కానీ, ఇప్పుడు సాధారణ ప్రజలు వచ్చి తమ సమస్యలను నేరుగా చెప్పుకుంటున్నారని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు.

త్రిబుల్ ఆర్ తెలంగాణకు మణిహారమని,త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నామని, అధికారులతో రివ్యూ చేశామన్నారు.

వలిగొండ మండలం సంగెం బ్రిడ్జి, పోచంపల్లి రుద్రవెల్లి బ్రిడ్జి నిర్మాణాలకు అనుమతిచ్చామని, కొలనుపాక వద్ద వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.

17 కోట్లు కేటాయించామని, బస్వాపూర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా 18 ఏళ్లు నిండిన వారికి కూడా పరిహారం అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రూ.100 కోట్లతో మోడల్ క్రికెట్ స్టేడియం నిర్మించడం జరుగుతుందని, యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, భువనగిరి జిల్లా రోడ్డు త్వరలోనే నిర్మాణం అవుతుందని,గుట్టపైకి ఆటోల అనుమతించే విషయమై పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలను గెలిపించినందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కాగా మంత్రిగా మొదటిసారి జిల్లాకు వచ్చిన వెంకట్ రెడ్డికి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె.

జెండాగె పుష్పగుచ్చం అందించి స్వాగతం పలకగా,పోలీసులు గౌరవ వందనం చేశారు.

వైరల్: బీర్ సీసాలో ప్రత్యక్షమైన ప్లాస్టిక్ స్పూన్.. ఎక్కడంటే..