తండ్రిని కోల్పోయిన పిల్లలకు అండగా మంత్రి కోమటిరెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా:రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) మరోసారి తన దయార్ద్ర హృదయాన్ని చాటుకున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన దేవర శ్రీశైలం ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆ నిరుపేద కుటుంబం రోడ్డున పడింది.

భర్తను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న మృతిని భార్య మమత పిల్లలతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాయం కోసం సోమవారం హైదరాబాద్(Hyderabad ) లోని మంత్రి నివాసానికి వెళ్లింది.

అక్కడే ఉన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వారిని మంత్రి వద్దకు తీసుకెళ్లగా తమ కుటుంబ పరిస్థితిని మంత్రితో చెప్పి గోడు వెళ్లబోసుకుంది.

దీంతో చలించిన మంత్రి వెంకటరెడ్డి మమతను అక్కున చేర్చుకుని అధైర్య పడవద్దని,మీకు తాను అండగా ఉంటానని, కుటుంబ పోషణ కోసం తక్షణ సాయంగా రూ.

1.50 లక్షలు మమతకు అందజేశారు.

ముగ్గురు పిల్లలు సనిక్షిత, అంజలి,అజయ్ కుమార్ లను పూర్తిగా తానే చదివిస్తానని,మీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా కల్పించారు.

తమ పరిస్థితిని చూసి మానవత్వంతో తమ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి వెంకటరెడ్డికి మమత, పిల్లలు కృతజ్ఞతలు తెలిపారు.

ఈకార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు గుర్రం లక్ష్మీ నర్సింహారెడ్డి,పైళ్ల సోమిరెడ్డి,మోత్కూరు పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు గౌడ్,పన్నాల శ్రీనివాస్ రెడ్డి,మెంట నగేష్, గొలుసుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

లగ్జరీ వాహనాలపై టాలీవుడ్ సెలబ్రిటీల మోజు.. టాలీవుడ్ స్టార్స్ కార్ల ఖరీదెంతో తెలుసా?