మంత్రి కొడాలి అలా… ఎంపీ సురేష్ ఇలా… జ‌గ‌న్ క్లాస్ తీసుకోవాల్సిందే…!

రాజ‌కీయాల్లో రెండు భిన్న‌మైన పార్టీల‌కు చెందిన నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేదంటే.అర్ధం చేసుకోవ‌చ్చు.

ఎందుకంటే.నిత్యం ప్ర‌త్య‌ర్థులే క‌నుక .

ఎప్పుడూ క‌త్తులు నూరుకుంటారు క‌నుక‌.వారి మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఏంట‌ని భావించ‌వ‌చ్చు.

కానీ, ఒకే పార్టీలో ఉంటూ.ఒకే పార్టీ విధానాల‌ను అనుస‌రిస్తూ.

కూడా నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేదంటే.ఏమ‌నాలి? ఇప్పుడు వైసీపీపై సోష‌ల్ మీడియాలో ఇలాంటి విష‌యంపైనే ట్రోల్స్ ఎక్కువ‌గా న‌డుస్తున్నాయి.

జ‌గ‌న్ సార్‌.వీళ్ల‌కు మీరు క్లాస్ తీసుకోవాల్సిందే! అని కొంద‌రు అంటుంటే.

వీరిని పెట్టుకుని ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం క‌ష్టం సార్‌!! అని కొంద‌రు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

దీంతో ఇప్పుడు వైసీపీ నేత‌ల విష‌యం స‌ర్వత్రా విస్మ‌యానికి వేదిక‌గా మారింది.ఇంత‌కీ విష‌యం ఏంటంటే.

ఇటీవ‌ల రాజ‌ధాని అమ‌రావ‌తిలో రైతులు చేస్తున్న ఉద్య‌మానికి యాంటీగా.కొంద‌రు ఉద్య‌మం చేప‌ట్టారు.

ఈక్ర‌మంలో వారిని అడ్డుకున్న రాజ‌ధాని రైతుల‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం వారి చేతుల‌కు బేడీలు వేయ‌డం తెలిసిందే.

స‌రే.ఇది పెద్ద వివాదం కావ‌డం.

ప్ర‌భుత్వం త‌ర‌పున స‌ద‌రు పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం.ఏకంగా ఎస్పీ లైన్‌లోకి వ‌చ్చి.

ఈ విష‌యాన్ని ఇంత‌టితో వ‌దిలేయాల‌ని మీడియాను వేడుకోవ‌డం.సారీ చెప్ప‌డం వంటివి కూడా మ‌నం చూశాం.

"""/"/ అయితే, ఈ విష‌యంపై వైసీపీకి చెందిన స్థానిక ఎంపీ నందిగం సురేష్ స్పందించారు.

అదేస‌మ‌యంలో కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొడాలి నాని కూడా దీనిపై స్పందించారు.

అయితే, ఇద్ద‌రూ ఒకే పార్టీకి చెందిన వారు క‌దా.సో వివాదాన్ని ఒకే విధంగా చూస్తారు.

అని ప‌రిశీల‌కులు అనుకున్నారు.కానీ, నందిగం సురేష్‌.

ఏకంగా ఈ చ‌ర్య‌ను త‌ప్పుప‌ట్టారు.రైతుల‌కు సంకెళ్లు వేయ‌డం చాలా త‌ప్పు.

అని ఆయ‌న స‌మ‌ర్ధించుకుని.స‌ర్కారును ఒక‌ర‌కంగా ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశారు.

మ‌రి.సురేష్ క‌న్నా ఎప్పుడో రాజ‌కీయాల్లోకివ‌చ్చిన నాని.

ఎలా స్పందిస్తార‌ని అనుకుంటారు.కానీ, అలా సానుకూలంగా స్పందిస్తే.

ఆయ‌న కొడాలి నాని ఎందుక‌వుతార‌నుకున్నారో.ఏమో.

ఆయ‌న బేడీలు వేయ‌డాన్ని పూర్తిగా స‌మ‌ర్ధించుకున్నారు.రైతులు పారిపోయేందుకు ప్ర‌య‌త్నించారు అందుకే పోలీసులు బేడీలు వేశార‌ని.

ఇది ఎంత మాత్రం త‌ప్పుకాద‌ని వ్యాఖ్యానించారు.మొత్తానికి ఈ ఇద్ద‌రి వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి వైసీపీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది.