వాలంటీర్ల వ్యవస్థ పై మంత్రి కారుమూరి పొగడ్తలు..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ( Volunteer System ) చుట్టూ రాజకీయం తిరుగుతోంది.
ఈ వ్యవస్థ వల్ల రాష్ట్రంలో వాలంటీర్ లు మహిళల అక్రమ రవాణాకు గురవుతున్నారని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి.
ఇక ఈ వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగముంటేనే ఉంచుతా లేకపోతే తీసేస్తాను అని చంద్రబాబు ( Chandrababu ) ఇటీవల పులివెందుల పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోపక్క వైసీపీ నాయకులు వాలంటీర్ల వ్యవస్థ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు.
ఇక ఇదే సమయంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మూడు లక్షల మంది వాలంటీర్లకు జీతాలు పెంచే ఆలోచన వైసీపీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ మంత్రి కారుమూరి( Minister Karumuri ) వాలంటీర్ల వ్యవస్థ దేశానికి ఆదర్శమని పొగడ్తల వర్షం కురిపించారు.
గురువారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడటం జరిగింది.ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల సేవలను ప్రజల వద్దకే వచ్చి అందించేందుకు వీలుగా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేయడం జరిగింది.
అంతేకాకుండా సురక్షిత పథకం ద్వారా 11 రకాల సేవలను అందిస్తున్నట్లు మంత్రి కారుమూరి చెప్పుకొచ్చారు.
నాగార్జున వందో సినిమా దర్శకుడు ఎవరో తెలిసిపోయిందా..?