చంద్రబాబు చరిత్రంతా ఇలాంటి కుట్రలే – మంత్రి జోగి రమేష్

గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కామెంట్స్.'పసుపు రంగు రాయిలు, పసుపు రంగు రెక్కీలు' కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్ర బాబుదే.

చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు క్షమాపణలు చెప్పాల్సిన మొదటి వ్యక్తి చంద్ర బాబే.వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం, ఇలాంటి దాడులు చేసే కుసంస్కారం పార్టీ కి లేదు.

పార్ట్‌-1లో పవన్‌ మీద రెక్కీ అని హడావుడి చేశాడు.అది తాగుబోతులు చేసిన వీరంగం అని తేలింది.

పార్ట్‌-2లో రాయి వేసినట్టు హడావుడి చేస్తున్నాడు.రాయి ఎవరితో వేయించుకున్నాడో కూడా తేలుస్తాము.

అప్పట్లో మల్లెల బాబ్జికి కత్తి ఇచ్చి పంపిందెవరో కూడా ప్రజలకు తెలుసు.చంద్రబాబు చరిత్రంతా ఇలాంటి కుట్రలే.

ఇప్పుడు నందిగామ వెళ్లేలోపే రాయి వేయించుకునే స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నాడు.రేపు ఇప్పటంలో పవన్‌ పార్ట్‌-3 మొదలుపెడతాడు.

సందీప్ రెడ్డి వంగ ను ట్రోల్ చేస్తున్న బాలీవుడ్ మాఫీయా…