తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది - మంత్రి జగదీష్ రెడ్డి

మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్.ఇది ముముమ్మాటికీ దేశద్రోహపూరిత చర్యే.

తెలంగాణా ప్రభుత్వంపై కేంద్రం కక్ష్యపూరితంగా వ్యవరిస్తోంది.రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలి అన్నది కేంద్రం కుట్ర.

ఏ పి నుండి రావాల్సిన 12900 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి.

కేంద్రానికి మోర పెట్టుకున్నా స్పందించలేదు.విద్యుత్ తోపాటు, బకాయిలు, పి పి ఏ లలోను ఎపి తెలంగాణాకు నష్టమే చేసింది.

ఒక్కరోజు కుడా కేంద్రం జోక్యం చేసుకోలేదు.2014 ఎన్నికల ప్రచారంలో దేశంలో వెలుగులు నింపుతామన్న మాట దక్కేలా లేదు.

గుజరాత్ తో సహా అన్ని రాష్ట్రాలలో విద్యుత్ రంగం సంక్షోభంలో పడింది.దేశ రాజధానితో సహా అన్ని రాష్ట్ర రాజధానిలలో విద్యుత్ కోతలు.

ఎటువంటి కోతలు లేనిది ఒక్క తెలంగాణాలోనే.విద్యుత్ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన విజయాలను బిజెపి సర్కార్ జీర్ణించుకోలేక పోతుంది.

ఆందుకే బిజెపి సర్కార్ కు కంటగింపు.వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ కు అడ్డుపుల్ల వేసేందుకే.

రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేదు.కృష్ణా, గోదావరి జలాల విషయంలోనూ కేంద్రం అదే ధోరణి అవలంబిస్తుంది.

అపెక్స్ మీటింగ్ పెట్టాలి అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ణప్తిని పట్టించుకోలేదు.ఎపి నుండి రావాల్సిన 12941 కోట్ల బకాయిల విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఉంది.

ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకుంది.నెల రోజుల్లో చెల్లించాలి అనడం ముమ్మాటికీ దుర్మార్గమే.

జాతీయ ప్రభుత్వంగా చెయ్యల్సింది కాదు.తెలంగాణాను చీకట్లోకి పంపేందుకే ఈ నిర్ణయాలు.

మోటర్లకు మీటర్లు పెట్టను అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందుకే ఈ దుశ్చర్య.కేంద్రానికి ఏపీ లేఖలే కనిపిస్తున్నాయి.

తెలంగాణా లేఖలు మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదు.