కేటీఆర్ సభాస్థలి పరిశీలించిన మంత్రి
TeluguStop.com
నల్లగొండ జిల్లా:హాలియాలో ఈ నెల 14న మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో హాలియాలో జరుగు సభాస్థలితో పాటు, పెద్దవూర మండలం సుంకిశాలలోని హైదారాబాద్ మెట్రో వాటర్ ప్లాంట్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే స్థలాన్ని గురువారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి,ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ యం.
సి కోటిరెడ్డి,సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ తో కలసి పరిశీలించారు.మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులకు మంత్రి పలు సలహాలు,సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్,మిర్యాలగూడ ఆర్.
ఎస్.పి,అనుముల తహశీల్దార్,హాలియా మున్సిపాలిటీ కమీషనర్,వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు,అధికారులు,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
గేమ్ ఛేంజర్ మూవీ చాలా హర్ట్ చేసింది.. అంజలి సంచలన వ్యాఖ్యలు వైరల్!