స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీపై మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశాలు

తెలంగాణలో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీపై మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.ఈ క్రమంలో భర్తీ ప్రక్రియ ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశాలు ఇచ్చారు.

ఇప్పటివరకు 40,936 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.హైదరాబాద్, వరంగల్, ఖమ్మంతో పాటు నిజామాబాద్ జిల్లాల్లో పరీక్షా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.

అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు మంత్రి హరీశ్ రావు సూచించారు.

వీడియో: ఇదెక్కడి పిచ్చి పని.. ఫైర్‌క్రాకర్ బాక్స్‌పై కూర్చోబెట్టి చంపేశారు..?