బిజెపిపై మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్
TeluguStop.com
కన్నతల్లికి అన్నంపెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లుగా బీజేపీ నేతల తీరు ఉన్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు.
ప్రధాని సొంత రాష్ట్రంలోనే రూ.750 పెన్షన్ ఇస్తున్నారు.
మునుగోడులో మాత్రం రూ.3 వేల పింఛన్ ఇస్తారా అని ప్రశ్నించారు.
ఇంతకంటే మోసం, దగా మరొకటి ఉండదని చెప్పారు.తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
బీజేపీవన్నీ జుమ్లా మాటలని ఆగ్రహం వ్యక్తంచేశారు.నల్లచట్టాలు తెచ్చి ప్రధాని మోదీ రైతుల ఉసురుసోసుకున్నాడని విమర్శించారు.
750 మంది రైతులను పొట్టనపెట్టుకన్న మోదీ.చివరకు రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందన్నారు.
రైతులకు ఇచ్చిన హామీలను ఏడాదైనా అమలు చేయలేదన్నారు.
Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters