కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్ రావు ఫైర్

కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు.తెలంగాణ గెలవాలి అంటే కేసీఆర్ కు మద్ధతు ఇవ్వాలని సూచించారు.

తెలంగాణ వ్యతిరేక శక్తులు అన్నీ జట్టు కడుతున్నాయని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

కేసీఆర్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్రిమినల్ అంటున్నారన్న ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిపోయి జైలుకు వెళ్లిన అసలైన క్రిమినల్ రేవంత్ రెడ్డి అని తెలిపారు.

రేవంత్ రెడ్డి బెయిల్ పై బయట ఉన్న ఖైదీ అని చెప్పారు.అంతేకాకుండా నియంత బుద్ది ఉన్నది రేవంత్ రెడ్డికేనని ఆరోపించారు.

రేవంత్ సీట్లు అమ్ముకుంటున్నారని సొంత పార్టీ నేతలే అంటున్నారని పేర్కొన్నారు.ఓయూ విద్యార్థులను అవహేళన చేస్తూ రేవంత్ మాట్లాడారన్న మంత్రి హరీశ్ రావు సమైక్యవాదులకు ఊడిగం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ కు ఓటేస్తే ఇబ్బందులు తప్పవని తెలిపారు.

ఇది కదా టాలీవుడ్ హీరోల రేంజ్.. బాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టెసి మరీ..