కరోనాను జయించిన మంత్రి హరీష్‌రావు..!

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.నిత్యం వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధుల వరకు అంతా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

ఇప్పటికే ఈ వైరస్ బారి నుండి చాల మంది ప్రాణాలు కోల్పోయారు.మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్‌ రావుకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

వైద్యుల సూచనల మేరకు ఆయన హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకున్నారు.అయితే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్‌ రావు కరోనా నుండి కోలుకున్నారు.

తాజాగా హరీష్ రావు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.ఈ పరీక్షలల్లో హ‌రీష్‌ రావుకు క‌రోనా నెగిటివ్ వచ్చిందని వైద్యులు వెల్లడించారు.

మంత్రి హరీష్ రావుకి క‌రోనా పాజిటివ్ వచ్చిన దగ్గర నుంచి వైద్యుల సలహాలు, సూచనలు పాటించారని అందుకే కరోనాను జయించినట్లు ఆయన వెల్లడించారు.

ఇక సోమ‌వారం నుంచి అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యే అవకాశం ఉందని సమాచారం.

పలువురు మంత్రులు ఆశించినట్లుగానే హరీష్ రావు కరోనా బారి నుండి త్వరగా కోలుకోవడం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నల్లటి వలయాలను మాయం చేసే సూపర్ పవర్ ఫుల్ రెమెడీస్ ఇవే!