ఫ్రీడమ్ ర్యాలీలో ఎస్ఎల్ఆర్ తుపాకీతో మంత్రి హ‌ల్ చ‌ల్

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదంలో చిక్కుకున్నారు.మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో నిర్వ‌హించిన ఫ్రీడ‌మ్ ర్యాలీలో పాల్గొన్న ఆయ‌న‌.

ఎస్ఎల్ఆర్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జ‌రిపారు.మంత్రి కాల్పులు జ‌రుపుతున్న స‌మ‌యంలో పోలీస్ ఉన్న‌తాధికారులు వారించ‌క‌పోవ‌డంపై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

భార‌త స్వాతంత్య్ర వ‌జ్రోత్స‌వాల పేరిట ప్ర‌భుత్వం ప‌లు కార్య‌క్రమాల‌ను నిర్వ‌హిస్తుంది.దీనిలో భాగంగా నిర్వహించిన ఫ్రీడ‌మ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా గాల్లోకి కాల్పులు జ‌రిపారు.ప్ర‌స్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.