మానవత్వం చాటుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం…

కర్నూలు జిల్లా: మానవత్వం చాటుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం.

కర్నూలు జిల్లా, దేవనకొండ మండలం ఈదులబండ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.మద్దికెర నుండి కర్నూల్ కు వెళ్తుండగా కారు టైరు పేలి పల్టీలు కొట్టి డోర్ ఓపెన్ అవడంతో ప్రభావతి అనే మహిళ అక్కడికక్కడే మృతి.

మరో నలుగురికి గాయాలు.వీరందరూ మద్దికేర కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.

అదే సమయంలో చెల్లెలి చెలిమల గ్రామానికి గడపగడపకు వెళ్తున్న మంత్రి గుమ్మనూరు జయరాం.

బాధితులను దగ్గరుండి అంబులెన్స్ ను పిలిపించి ఆసుపత్రికి తరలించారు.బాధితులకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించాలని కర్నూలు ప్రభుత్వ వైద్య అధికారులను ఆదేశించారు.

బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన మంత్రి గుమ్మనూరు జయరాం.

పెసలతో మీ అందం రెట్టింపు.. ఇలా వాడితే మోర్ బెనిఫిట్స్..!