బీజేపీ పై మంత్రి ఎర్రబెల్లి హాట్ కామెంట్స్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ఫైరయ్యారు.నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలని సూచించారు.

మునుగోడుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చండూరులో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మీడియాతో మాట్లాడారు.

బీజేపీ నేతలు డబ్బు మదంతో మునుగోడు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు.మునుగోడు ప్రజలు చైతన్యవంతులని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆలోచించి ఓట్లు వేయాలన్నారు.

జిడ్డుగల చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!