వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..
TeluguStop.com
వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
శ్రీనివాస్ అనే రోగిని ఎలుకలు కొరికి గాయపర్చిన విషయం తెలిసిందే.వెంటనే స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఎంజీఎం సూపరింటెండెంట్ ను బదిలీ చేయడంతో పాటు ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేశారు.
నూతన సూపరింటెండెంట్ గా డాక్టర్ చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు.ఎంజీఎం ఆస్పత్రిని మంత్రి ఆకస్మిక తనిఖీ చేసి బాధిత రోగి శ్రీనివాస్ ను పరామర్శించారు.