టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు.
ఖమ్మం సభ లో మూర్ఖంగా,అబద్ధాలు మాట్లాడారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
వరంగల్ జిల్లా రాయపర్తిలో క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న దుస్తులను పంపిణీ చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఎన్టీఆర్ ను మోసం చేసి టీడీపీని గుంజుకున్న ఘనత చంద్రబాబుదని,కార్యకర్తలను పట్టించుకోకుండా ఆంధ్రాల పడ్డ చంద్రబాబు కూడా ఇంకా తెలంగాణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లనే దగ్గరికి తియ్యని వ్యక్తి తెలంగాణలోని కార్యకర్తలను పట్టించుకుంటడా అని ప్రశ్నించారు.
ఫస్ట్ ఎన్టీయార్ కుటుంబాన్ని దగ్గరకు తియ్యి.తర్వాత తెలంగాణ గురించి ఆలోచించాలని సూచించారు.
ఎన్టీఆర్ ను మోసం చేసిన నీకు టీడీపీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. పెళ్లి జరిగేది అప్పుడేనా?