జ‌న‌సేన అధినేత‌పై మంత్రి దాడిశెట్టి రాజా విమ‌ర్శ‌నాస్త్రాలు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ పై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

ఏపీలో కాపులు ప‌వ‌న్ ను న‌మ్మే ప‌రిస్థితులు లేవ‌ని స్ప‌ష్టం చేశారు.ప‌వ‌న్ కు ఓటు వేస్తే చంద్ర‌బాబుకు ఓటు వేసిన‌ట్టేన‌ని ఇప్ప‌టికే కాపుల‌కు అర్థ‌మై ఉంటుంద‌ని తెలిపారు.

తుని ఘ‌ట‌న‌లో కాపుల‌ను చంద్ర‌బాబు చిత్ర‌హింస‌ల‌కు గురి చేశార‌ని విమ‌ర్శించారు.జ‌న‌సేన పార్టీని ఎందుకు న‌మ్మాలో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ప‌వ‌న్ ఉన్నార‌ని విమ‌ర్శించారు.

ప్ర‌జ‌ల‌ను జ‌న‌సేన వైపు చూడ‌మంటున్న ప‌వ‌న్ క‌ల్యాణ్.తను మాత్రం టీడీపీ వైపు చూస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.

లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కిన నటుడు సుబ్బరాజు… ఫోటోలు వైరల్!