అమరావతి రైతుల పాదయాత్ర ఇక ముగిసినట్టే... మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com
విజయనగరంలో మీడియాతో మాట్లాడిన బొత్స.అమరావతి రైతుల పేరుతో చేస్తున్న పాదయాత్ర ఆగిపోయినట్లుగా భావిస్తున్నానని అన్నారు.
ఈ పాదయాత్రను టీడపీ వెనకుండి నడిపిస్తోందని పేర్కొన్నారు.పాదయాత్రలో ఎంతమంది ఉన్నారు? అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు అడిగిందని.
600 మందితో వస్తున్న పాదయాత్రలో 60మంది కూడా రైతులు లేరని ఆయన ఆరోపించారు.
అసలైన రైతులు లేరిన, టీడీపీ ముసుగులో ఉన్న అమరావతి రైతులు తమ పాదయాత్రను ఆపేశారని పేర్కొన్న బొత్స.
విశాఖ పరిపాలనా రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష సాకారం అయినట్టేనని అన్నారు.త్వరలోనే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామన్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్2, సోమవారం 2024